తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి చేసే స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు, వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వెంకటేష్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా స్క్రిప్ట్ సెలక్షన్ లో అందరి స్టార్ హీరోలకంటే గొప్పగా ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. క్లాస్ , మాస్ , ఫ్యామిలీ , యూత్ ఇలా అందరి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సినిమాలన్నీ సెన్సేషన్ సృష్టించాయి.
అప్పట్లో టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ లిస్ట్ తీస్తే అందులో చిరంజీవి మరియు వెంకటేష్ సినిమాలు మాత్రమే ఉండేవి. ఆ రేంజ్ సక్సెస్ లు చూసాడు కాబట్టే అందరూ ఆయనని విక్టరీ వెంకటేష్ అని పిలుస్తూ ఉంటారు. ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ని ఇస్తున్నాడు అంటే వెంకటేష్ కి జనాల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే వెంకటేష్ కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నా బి.గోపాల్ దర్శకత్వం లో వచ్చిన ‘బొబ్బిలి రాజా’ అనే చిత్రం ఎంతో ప్రత్యేకం.
ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమాని 20 రోజుల పాటు అడవి లోనే తీసారట. ఫస్ట్ హాఫ్ మొత్తం అడవి లోనే ఉన్న సంగతి అందరికి తెలిసిందే. క్రూర మృగాలు తిరుగుతూ ఉండే చోట అన్ని రోజులు షూటింగ్ అంటే సాధారణమైన విషయం కాదు. కానీ అలాంటి రిస్క్ ఉన్న ప్రాంతం లోనే షూటింగ్ ని పూర్తి చేసారు. అయితే షూటింగ్ జరుగుతున్న రోజుల్లో వెంకటేష్ బ్రేక్ సమయం లో ఒక చెట్టు క్రింద కూర్చొని నిద్రపోతున్నాడు అట.
అయితే ఒక విషపు పురుగు వెంకటేష్ (Venkatesh) ముఖం మీద వాలింది. ఇది ఎవ్వరూ గమనించలేదు, కానీ డైరెక్టర్ బి.గోపాల్ ఇది గమనించాడు, ఆ పురుగు కుడితే ప్రాణాలకే ప్రమాదం, అందుచేత ఆ పురుగుని తరిమే క్రమం లో బి.గోపాల్ చెయ్యి వెంకటేష్ చెంప కి బలంగా తగిలింది. దెబ్బకి నిద్రలో నుండి తేరుకున్న వెంకటేష్ జరిగిన విషయం తెలుసుకొని డైరెక్టర్ కి కృతఙ్ఞతలు తెలియచేసాడట.