The 100 Movie: ‘ది 100’ విషయంలో తప్పు ఎక్కడ జరిగింది.. సాగర్ కరెక్ట్ చేసుకోవాల్సిందే!

సీరియల్స్ తో వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని కొందరు హీరోలుగా మారుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. తప్పులేదు.. తమిళంలో శివకార్తికేయన్ వంటి వాళ్ళు స్మాల్ స్క్రీన్ నుండి వచ్చి స్టార్ అయినవాళ్లే. కానీ సీరియల్స్ లో మెయిన్ హీరోలం కదా.. బిగ్ స్క్రీన్ పై కూడా మెయిన్ హీరో హడావిడే చేయాలంటే… వర్కౌట్ అవ్వదు. సీరియల్స్ లో ఓ మాదిరిగా చేసినా సరిపోతుంది. దానికి తగ్గ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఓకే చేస్తారు.

The 100 Movie

కానీ డబ్బులు పెట్టుకుని థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడికి అంతకు మించిన వినోదం, వైవిధ్యం కావాలి. అది మిస్ చేస్తే సక్సెస్ అవ్వడం కష్టం. ఆల్రెడీ ఇది ప్రదీప్ మాచిరాజు, యాంకర్ రవి, గెటప్ శీను, షకలక శంకర్ వంటి వారి విషయంలో ప్రూవ్ అయ్యింది. వాళ్ళని చూసి కూడా ‘మొగలిరేకులు’ ఫేమ్ సాగర్ ఏమీ తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన ‘ది 100’.

గత వారం జూలై 11న ‘ది 100’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. మొదటి నుండి సినిమాని బాగా ప్రమోట్ చేశారు. పవన్ కళ్యాణ్, అతని తల్లి అంజనా దేవి వంటి వాళ్ళు సినిమాను ప్రమోట్ చేశారు. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి వారు కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ కు తమ వంతు సాయం చేశారు. ఇంత చేసినా ‘ది 100’ ప్రేక్షకులకి రీచ్ అవ్వలేదు.

అందుకు కారణం ఏంటా.. అని ఆరా తీస్తే.. సాగర్ ‘మొగలిరేకులు’ సీరియల్లో చేసిన ఆర్.కె.నాయుడు పాత్రకి ఇది ఎక్స్టెన్షన్ లా ఉంది తప్ప కొత్తగా ఏమీ అనిపించలేదు అంటున్నారు. సో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి.. వాళ్ళు ఓన్ చేసుకునే పాత్రలు చేస్తే సాగర్ హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ‘ది 100’ లో రెగ్యులర్ హీరోయిజమే ఉంది. ‘షాదీ ముబారక్’ బాగానే ఉంటుంది. కానీ అందులో సాగర్ పెర్ఫార్మన్స్ వీక్. సో సినిమాకి, ప్రమోషన్ కి ఎంత డబ్బు పెట్టినా హీరోగా నిలబడాలి అంటే ఈ విషయాల్లో కరెక్ట్ చేసుకోవాలి.

26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus