పవన్ కళ్యాణ్ కెరీర్ లో కల్ట్ మూవీస్ లో ఒకటిగా ‘తమ్ముడు’ గురించి చెప్పుకోవచ్చు. ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది.పవన్ కళ్యాణ్ లోని కామెడీ టైమింగ్ ను పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది. ‘తొలిప్రేమ’ వంటి పూర్తిస్థాయి ప్రేమ కథ తర్వాత పవన్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలని భావించి చేసిన సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ సుబ్బు అనే గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడు. ‘హీరో అంటే ఇలా కూడా చేయొచ్చా’ అనే కొత్త డెఫినిషన్ ఈ సినిమాతో పవన్ చెప్పాడని చెప్పాలి.
క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్’ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ జూలై 15తో 26 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి:
నైజాం | 3.20 cr |
సీడెడ్ | 1.85 cr |
ఉత్తరాంధ్ర | 1.18 cr |
ఈస్ట్ | 0.77 cr |
వెస్ట్ | 0.54 cr |
గుంటూరు | 0.78 cr |
కృష్ణా | 0.55 cr |
నెల్లూరు | 0,38 cr |
ఏపీ+తెలంగాణ | 9.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.21 cr |
వరల్డ్ టోటల్ | 9.46 cr |
‘తమ్ముడు’ సినిమా రూ.5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి వారం రన్ సాదా సీదాగానే నడిచింది. కానీ 2వ వారం నుండి బాగా పికప్ అయ్యింది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.9.46 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బయ్యర్లకు ఈ సినిమా రూ.4.26 కోట్ల లాభాలు సూపర్ హిట్ గా నిలిచింది. నైజాంలో ‘చూడాలని ఉంది’ కలెక్షన్లను అధిగమించి ఆల్ టైం రికార్డులు సృష్టించింది.