మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ.. భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. 12వ రోజున(నిన్న) కూడా ఈ చిత్రం రూ.80లక్షల పైనే షేర్ ను వసూల్ చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.45కోట్ల షేర్ ను దాటింది. అయితే ‘ఓ కొత్త హీరో సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు ఎలా వస్తాయి.. ఇవన్నీ ఫేక్’ అంటున్న వారు కూడా లేకపోలేదు.
వారి విశ్లేషణ ప్రకారం.. 3 రోజులకే రూ.50కోట్లు గ్రాస్.. 7రోజుల్లోనే రూ.70కోట్లు గ్రాస్ అన్నారు. అంటే మొదటి వారానికే ఈ చిత్రం రూ.45కోట్ల షేర్ ను దాటేసి ఉండాలి.కానీ అప్పటికి రూ.39కోట్ల షేర్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు.పైగా ‘ఉప్పెన’ టీం ఈ వారం ఎండింగ్లో రూ.100కోట్ల గ్రాస్ పోస్టర్ ను కూడా విడుదల చేసే పనిలో ఉన్నారని కూడా టాక్. పైగా ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమారే ఈ చిత్రం రూ.100కోట్లు వసూల్ చేస్తుందని చెప్పడం.
ఇవన్నే ఫేక్ కు పరాకాష్ట అనేది వారి వాదన. ఇవన్నీ తెలుసుకుని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఇక రూ.100కోట్ల పోస్టర్ ఐడియాని లైట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ అలా ఉంచితే.. బుక్ మై షోలో ‘ఉప్పెన’ కు బుకింగ్స్ బాగున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు 100శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు రన్ అవుతున్నాయి.. పైగా విజయ్ సేతుపతి వంటి స్టార్ ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో కూడా ఆ అంచనాలు డబుల్ అయ్యాయి. పైగా టికెట్ రేట్లను కూడా పెంచారు. ఇవన్నిటినీ బట్టి ‘ఉప్పెన’ కలెక్షన్లను జెన్యూన్ అనే చెప్పొచ్చు కదా..!