Vijay Devarakonda, Rashmika: హాట్ టాపిక్ గా మారిన విజయ్- రష్మిక పెళ్ళి వార్త..!

రష్మిక మందన… ఇప్పుడో లీడింగ్ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది. అక్కడ ఎంత వరకు నిలదొక్కుకుంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. సరే ఈ విషయాల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు మేటర్ కు వద్దాం. కొద్ది గంటల నుండీ రష్మిక – విజయ్ దేవరకొండ పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Click Here To Watch

సినిమా వాళ్ళ పై ఇలాంటి వార్తలు కామనే..! అందులోనూ విజయ్- రష్మిక చాలా సన్నిహితంగా ఉంటారు. విజయ్ దేవరకొండ ఇంటికి ఈమె అప్పుడప్పుడు వెళ్ళి సందడి చేస్తుంటుంది కూడా..!ఇలాంటి న్యూస్ లు మనం గతంలో చూసాం.. అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్ళి వార్తలు ఎందుకు షికారు చేస్తున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. సౌత్ జనాలకి ఎలా ఉన్నా నార్త్ జనాలకి ఈ జంట గురించి పెద్దగా తెలీదు. విజయ్ – రష్మిక ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్నారు.

కాబట్టి.. ముంబై రోడ్ల పై తెగ తిరిగేస్తున్నారు.అక్కడ స్టే చేసే హోటల్లో కూడా వీళ్ళు ఎక్కువగా కలుస్తున్నారు. కాబట్టి.. బాలీవుడ్ మీడియా వీటిని హైలెట్ చేస్తుంది. అయితే వీళ్ళ పెళ్ళి వ్యవహారం కూడా పూర్తిగా అబద్దం కాదు. విజయ్ నాన్నగారికి తప్ప.. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనట. అప్పుడు విజయ్- రష్మిక లకి కూడా ఇష్టమైతేనే కదా వాళ్ళ వరకు వెళ్ళేది. అయితే విజయ్ సంగతేమో కానీ రష్మిక ని బట్టి చూస్తే ఇది పూర్తిగా జరిగే వ్యవహారం కాదు.

ఎందుకంటే గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత దానిని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. అసలు ఆమె సినిమాల్లోకి వచ్చిందే రక్షిత్ వల్ల. అలాంటిది ఇప్పుడు అతని గురించే రష్మిక పట్టించుకోవడం మానేసింది. అంతేకాకుండా రెండేళ్ళ వరకు పెళ్ళి చేసుకునేది లేదు అని ఈ మధ్యనే తెలిపింది రష్మిక. రెండేళ్ల తర్వాత ఆమె మూడ్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ అంచనా వేయలేరు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus