టాలీవుడ్లో ఉన్న విలక్షణ నటుల్లో సుబ్బరాజు ఒకరు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ చిత్రంతో ఈయన టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అటు తర్వాత ఆర్య, భద్ర,పోకిరి, పౌర్ణమి, దేశముదురు, యోగి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, లీడర్, బాహుబలి 2, గీత గోవిందం, సర్కారు వారి పాట వంటి చిత్రాలు ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన సుబ్బరాజు.. భీమవరం లోని డి.ఎన్.ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఇతని తండ్రి రామకృష్ణంరాజు గారు అదే కాలేజీ లో లెక్చరర్ గా పని చేసేవారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… సునీల్ ఈయన శిష్యులు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని వారు చెప్పుకొచ్చారు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఇదిలా ఉండగా…. సుబ్బరాజు కి 45 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు.
ఎందుకు ఈయన పెళ్లికి దూరంగా ఉన్నాడు అనే అనుమానం అందరిలోనూ ఉంది. అందుకు సుబ్బరాజు సమాధానమిస్తూ.. నాకు పెళ్ళి అవసరం లేదు. పెళ్లి జరగడం వేరు.. పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్లి జరగడం అనేది పెద్దల బలవంతం మీద ఆధారపడి ఉంటుంది.పెద్దల సంతోషం కోసం పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్ళి చేసుకోవాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా .. అంటూ సమాధానం ఇచ్చాడు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!