‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!

నాని డబుల్ రోల్ ప్లే చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీని దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నాని వరుస హిట్లు కొడుతున్న టైములో ఓ స్పీడ్ బ్రేకర్ లా వచ్చింది ఈ మూవీ. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది. దీని తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ మరో మూవీ చేయలేదు. ఇన్నాళ్టికి అతను ‘అంధాదున్’ రీమేక్ అయిన ‘మ్యాస్ట్రో’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మేర్లపాక గాంధీ.. ‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ” ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీని నేను 72 రోజుల్లో తెరకెక్కించాను. నేను చేసిన మూవీస్ లో ఎక్కువ టైం తీసుకున్న మూవీ ఇదే..! నాని గారు డబుల్ రోల్ ప్లే చేయడం వలన..అటు ఇటు మార్చాల్సి రావడం.. దాంతో కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. నాని గారు ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన మూవీ ఇది.

అయితే స్క్రిప్ట్ విషయంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నేను జనాలను కన్ఫ్యూజ్ చేసేసాను అని లేట్ గా అర్ధ’కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!మయ్యింది. ముందుగానే జాగ్రత్తపడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఈ మూవీ ఫలితం అనుకున్నట్టు రాకపోయినా నాని గారు మాత్రం నాకు బ్రదర్ లా అండగా నిలబడ్డారు. అతనికి ఫ్యూచర్లో మరో సినిమా చేయాలి. అది కూడా హిట్టు సినిమా చేయాలని నేను తాపత్రయ పడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మేర్లపాక గాంధీ.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus