‘వాసు’ చిత్రం నిరాశపరచడానికి గల కారణం అదేనట..!

‘కొన్ని సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతాయో తెలీదు’ అంటూ కొంతమంది ప్రేక్షకులు తెగ కామెంట్లు చేస్తుంటారు. అలా కామెంట్ చేసినవాళ్లు ఆ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు చూస్తారో లేదో తెలీదు కానీ… టీవీల్లోనో లేదా ఆన్లైన్లోనో ఆ సినిమా ఉంటే.. దానిని చూసి కల్ట్ క్లాసిక్, మన వాళ్ళకు టేస్ట్ లేదు అంటుంటారు. చాలా సినిమాల విషయాల్లో సోషల్ మీడియాలో వినిపించే కామెంట్లు ఇవే..! సరే ఇదంతా పక్కన పెట్టేసి.. ఇప్పుడు మనం వెంకటేష్ 50వ చిత్రం అయిన ‘వాసు’ గురించి మాట్లాడుకుందాం..! ‘దేవీ పుత్రుడు’ ‘ప్రేమతో రా’ వంటి చిత్రాలు ప్లాప్ అయినా.. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి.. మన వెంకీ మళ్ళీ ఫామ్లోకి వచ్చిన రోజులవి.

49వ సినిమా ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి ముఖ్య కారణమైన రచయిత త్రివిక్రమ్ ను తన 50వ చిత్రానికి కూడా డైలాగ్ రైటర్ గా పెట్టుకున్నాడు వెంకీ. పవన్ కళ్యాణ్ కు ‘తొలిప్రేమ’ వంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన కరుణాకరణ్ ‘వాసు’ చిత్రానికి దర్శకుడు. అలాంటప్పుడు అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ‘వాసు’ విఫలమయ్యాడు. ఆ చిత్రాన్ని ఇప్పుడు టీవీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ థియేటర్లలో టికెట్లు మాత్రం తెగలేదు. అందుకు ప్రధాన కారణం ఏంటని కొందరి విశ్లేషకులను ప్రశ్నిస్తే..

అప్పటికే 40ఏళ్ళ వయసు మించిన వెంకీని యూత్ అంటే జనాలు జీర్ణించుకోలేకపోయారని జవాబిచ్చారు. అదే టైములో ఎన్టీఆర్ వంటి యంగ్ హీరో ‘ఆది’ వంటి పవర్ ఫుల్ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తుంటే.. వెంకీ యూత్ అంటూ మైక్ పట్టుకుని తిరగడం జనాలు యాక్సెప్ట్ చెయ్యలేకపోయారట. అదే సినిమా వెంకీ కాస్త ముందుగా చేసి ఉన్నా.. లేదంటే వేరే యంగ్ హీరో చేసినా రిజల్ట్ వేరేలా ఉండేదని వారు చెబుతున్నారు. ల్యాండ్ మార్క్ చిత్రం అంటే కమర్షియల్ హంగులతో ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు.. కానీ ‘వాసు’ లో అవి మిస్ అయ్యాయని ఇట్టే అర్ధం చేసుకోవచ్చని వారి అభిప్రాయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus