Chiranjeevi, Maruthi: అలాంటి స్క్రిప్ట్ లో మెగాస్టార్ నటించబోతున్నారా?

వరుస సినిమాలలో నటిస్తూ చిరంజీవి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో చిరంజీవి నటించనున్నారు. బాబీ చిరంజీవి కాంబో మూవీకి వాల్తేరు శీను అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకటనే సంగతి తెలిసిందే.

జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగాస్టార్ మారుతి కాంబో మూవీ స్టోరీ లైన్ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలా ఉంటుందని తెలుస్తోంది. మారుతి ఫన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కు కూడా కథలో తగిన ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. మున్నాభాయ్ సిరీస్ తరహా లైన్ తో భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకుని మారుతి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉండేలా మారుతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆచార్య సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన చిరంజీవి తరువాత సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తుండగా మెగాస్టార్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus