Pushpa 2: 400 టికెట్ రేట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రారండి బాబు!

తొలి వారాంతం ముగిసేసరికి 621 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి.. ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా “పుష్ప 2” (Pushpa 2: The Rule) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) & సుకుమార్ (Sukumar) లను ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడమే కాక.. వాళ్లకి భీభత్సమైన స్టార్ డమ్ తెచ్చిపెట్టింది చిత్రం. హిందీ మార్కెట్ లో ఈ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఖాన్ లకు కూడా సాధ్యం కానటువంటి రికార్డులు క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టుల చేస్తా జేజేలు కొట్టించుకుంటోంది.

Pushpa 2

అయితే.. బయటి రాష్ట్రాల్లో రచ్చ చేస్తున్న “పుష్ప 2” (Pushpa 2) తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్స్ విషయంలో పుంజుకోలేకపోతుంది. అందుకు ముఖ్య కారణం భీభత్సంగా పెంచేసిన టికెట్ రేట్లు. బెనిఫిట్ షోస్ కి 900 నుండి 1200 వందల దాకా పలికిన టికెట్ రేట్లు.. ఇవాళ్టినుండి కాస్త తగ్గి తెలంగాణాలో 390 మరియు ఆంధ్రాలో 300 రేంజ్ కి వచ్చాయి. మొన్న సక్సెస్ మీట్ లోనూ నిర్మాత రవి స్వయంగా “టికెట్ రేట్ మీకు అందుబాటు ధరలో ఉండి..

థియేటర్ కి వచ్చి సినిమా చూడండి” అంటూ వేడుకున్న తీరు చూస్తేనే ఈ టికెట్ రేట్లు కలెక్షన్స్ ను ఎలా దెబ్బతీసాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ హిందీలో పుష్ప 2 సృష్టిస్తున్న హంగామాకి కారణం 150 రూపాయల టికెట్ రేట్లు అనే చెప్పాలి. అందుబాటు ధరలో ఉండడంతో ఒకటికి రెండుసార్లు చూస్తున్నారు. కొన్ని చిన్న సిటీలు, గ్రామాల్లో అయితే టికెట్ రేటు 100 రూపాయల లోపే ఉండడం కూడా ప్రేక్షకుల్ని థియేటర్ మళ్ళిస్తోన్న విషయం. మరి మైత్రీ వారు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 300 కి తగ్గకపోవడం అనేది చర్చనీయాంశం.

ఆల్రెడీ చాలా చోట్ల 60% కూడా ఫుల్స్ అవ్వడం లేదు. సినిమా లాంగ్ రన్ కి చాలా కీలకమైన రెండో వారంలో కనుక నిర్మాతలు ఇంకా మంకుపట్టు పట్టుకొని ఈ రేటుకి జనాల్ని థియేటర్లకి రావాలను కోరడం కూడా తప్పే. ఎందుకంటే.. దాదాపుగా 400 రూపాయలు ఒక టికెట్ కి ఖర్చు చేసి ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి రావడం అనేది ప్రస్తుతం కష్టం. మరి నిర్మాతలు ఇప్పటికైనా రియాలిటీని అర్థం చేసుకొని 150 రూపాయల టికెట్ ధరకి దిగతారో లేక ఇలాగే ఉండి సినిమాని స్వహస్తాలతో చంపుకుంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus