టాలెంట్ ఉన్న ఈ ముగ్గురు భామలకు కలిసిరాలేదుగా!

ప్రతి ఏడాది.. టాలీవుడ్ కు కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అయితే వాళ్లలో ఎంతమంది సక్సెస్ అవుతారు అన్నది చెప్పలేం. టాలెంట్ తో పాటు టైమింగ్ కూడా కలిసి రావాలి.. డెబ్యూ మూవీ సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడే ఆడియన్స్ దృష్టిలో.. దర్శకనిర్మాతల దృష్టిలో పడతారు. లేదంటే రెండో ఛాన్స్ రావచ్చు.. రావడానికి లేట్ అవ్వచ్చు.. అసలు రాకపోవచ్చు కూడా..! సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి అసలు విషయానికి వచ్చేద్దాం. ఫిబ్రవరి నెలలో ముగ్గురు కొత్త భామలు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు.

ముగ్గురూ టాలెంట్ ఉన్నవారే. అలాగే ముగ్గురూ కూడా కాస్త పేరున్న బ్యానర్లలోనే లాంచ్ అయ్యారు. కానీ ముగ్గురి డెబ్యూ ఫెయిల్ అయ్యింది. ముందుగా ఫిబ్రవరి 4న విడుదలైన ‘బుట్టబొమ్మ’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్.’సితార..’ వంటి పెద్ద బ్యానర్ నిర్మించిన సినిమా ఇది. అనిఖా చైల్డ్ ఆర్టిస్ట్ గా విశ్వాసం వంటి హిట్లు కొట్టింది. నాగార్జున మేనకోడలిగా ‘ఘోస్ట్’ సినిమాలో నటించింది. ‘బుట్టబొమ్మ’ లో కూడా చాలా చక్కగా నటించింది..

ఈమె లుక్స్ కూడా బాగున్నాయి. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈమెకు మంచి డెబ్యూ వేస్ట్ అయిపోయినట్టు అయ్యింది. ఇక ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్.ఈమె లుక్స్ చాలా బాగున్నాయి. ‘మైత్రి..’ వంటి బడా నిర్మాణ సంస్థలో ఈమె హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు మంచి డెబ్యూ వేస్ట్ అయిపోయింది అనే చెప్పాలి.

ఇక ఫిబ్రవరి 18న ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది గౌరీ కిషన్. ‘జాను’ సినిమాలో సమంత చిన్నప్పటి పాత్రలో అద్భుతంగా నటించింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై నిర్మించింది. అయినా సరే సినిమా ప్లాప్ అయ్యింది. గౌరీ కిషన్ డెబ్యూ వేస్ట్ అయిపోయింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus