కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన బై లింగ్యువల్ మూవీ ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి ఓపెనింగ్స్ ను నమోదు చేసింది.
అయితే వీక్ డేస్ లో పెద్దగా రాణించలేకపోయింది.ఓవరాల్ గా మొదటి వారం యావరేజ్ కలెక్షన్లు సాధించింది అని చెప్పొచ్చు. ‘ది వారియర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
5.31 cr
సీడెడ్
2.83 cr
ఉత్తరాంధ్ర
2.25 cr
ఈస్ట్
1.25 cr
వెస్ట్
1.11 cr
గుంటూరు
1.89 cr
కృష్ణా
0.92 cr
నెల్లూరు
0.62 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.93 cr
తమిళనాడు
1.08 cr
ఓవర్సీస్
0.66 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
18.85 cr
‘ది వారియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.18.85 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.21.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మొదటి వారం యావరేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ‘ది వారియర్’ రెండో వీకెండ్ ను ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రేపటి నుండి ‘థాంక్యూ’ థియేటర్లకు రాబోతుంది కాబట్టి.. ‘ది వారియర్’ ను జనాలు పట్టించుకునే అవకాశం లేదనే చెప్పాలి.