కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి కేసుల సంఖ్య అయితే క్రమంగా తగ్గుతుంది అని ప్రకటిస్తున్నారు. కానీ అవి నిజం కాదనే వాదనా వినబడుతుంది. అయితే మరణాల సంఖ్య మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మళ్ళీ ఇప్పుడు అన్ని పరిశ్రమలు మూతపడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఈ నెల రోజుల్లోనే వందల కోట్లు నష్టపోయినట్టు చెప్పుకొస్తున్నారు.
జనవరి నుండీ థియేటర్లు తెరుచుకోవడంతో దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఏప్రిల్ నుండీ మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అందరికీ వ్యాక్సిన్ అందే సరికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకూ టైం పడుతుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. దాంతో సెప్టెంబర్ వరకూ అయితే థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం వరుసగా తమ సినిమాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటే అప్పుడు తమ సినిమాని వదిలెయ్యాలి అనేది వారి ఆలోచన. ఈ విషయంలో ‘టక్ జగదీష్’ టీం ముందుంది అనే చెప్పాలి. అంతేకాదు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ టీం కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల వరకూ పర్వాలేదు కానీ పెద్ద హీరోల సినిమాల విడుదల ఈ ఏడాది కష్టమేనని ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!