దాస్ క ధమ్కీ ధియేటర్ లో వింత సంఘటన.. వైరల్ అవుతున్న వీడియో!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ క ధమ్కీ చిత్రం ఈరోజు అంటే మార్చ్ 22 న రిలీజ్ కాబోతోంది. చాలా చోట్ల షోలు పడ్డాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రంలో నటించడమే కాకుండా స్వయంగా విశ్వక్ సేన్ డైరెక్ట్ చేయడం అలాగే నిర్మించడం కూడా జరిగింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అతని కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యి విశ్వక్ సేన్ కు అలాగే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో.. ఈ చిత్రం పై ఎన్టీఆర్ అభిమానుల ఫోకస్ కూడా పడింది. ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ ఉండడం అలాగే ఉగాది పండుగ రోజు అంటే హాలిడే రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో మార్నింగ్ షోలు బాగా ఫిల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.దాస్ క ధమ్కీ సినిమాకి వెళ్తే ఓ ధియేటర్ లో రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా వేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైజాగ్ లోని సుకన్య ధియేటర్ లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు.’ దాస్ క ధమ్కీ సినిమా బదులు కన్ఫ్యూజ్ అయ్యి రవితేజ నటించిన ధమాకా సినిమా డౌన్ లోడ్ చేసి ఉంటాడు ధియేటర్ వాడు.’

‘రెండు సినిమాల ట్రైలర్లు, టైటిల్స్ ఒకేలా ఉండటం వల్ల కూడా ధియేటర్ వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు ‘ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటనతో వైజాగ్ లోని సుకన్య ధియేటర్ ట్రెండింగ్ లో నిలిచింది. అలాగే రవితేజ ధమాకా సినిమా కూడా మరోసారి వార్తల్లో నిలిచింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus