Thegimpu Collections: రెండో రోజు తెగించలేకపోయింది..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…

నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. అయితే రెండో రోజు ‘వీరసింహారెడ్డి’ ఎంట్రీతో కలెక్షన్లు బాగా తగ్గాయి. ఒకసారి ‘తెగింపు’ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.71 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర 0.77 cr
ఏపీ + తెలంగాణ 1.66 cr

‘తెగింపు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. ఇక రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.66 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే కానీ ఈ మూవీకి ఇక్కడ థియేటర్లు ఎక్కువ లేవు. రేపు ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక కష్టమనే చెప్పాలి

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus