Thaman: పవన్‌ ‘ఓజీ’కి ఇప్పటికున్న హైప్‌ చాలదా… తమన్ మరింత పెంచారుగా..!

టాలీవుడ్‌లో కేవలం సినిమా వర్కింగ్‌ టైటిల్‌, ట్యాగ్‌లైన్‌, షూటింగ్‌ అప్‌డేట్స్‌తో హైప్‌… అది కూడా బీభత్సమైన హైప్‌ సంపాదించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘ఓజీ’ అని చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ – సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంగీతం తమన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడున్న హైప్‌ చాలలేదు అన్నట్లు తమన్‌ మరింత పెంచాదు. ఈ సినిమా కోసం ఏకంగా స్పెషల్‌ టీమ్‌ పెట్టుకున్నారట.

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మేనియా ఎలాంటిదో అందరికీ తెలుసు. అలాంటి మేనియాను డబుల్‌, ట్రిపుల్‌ చేసేలా తమన్‌ కొన్ని అప్‌డేట్స్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో #TheyCallHimOG అంటూ ట్రెండింగ్‌ మొదలైంది. ‘బ్రో’ సినిమా విడుదలవుతుంటే.. ‘ఓజీ’ ఎందుకు ట్రెండింగ్‌లోకి వచ్చింది అనే డౌట్‌ వచ్చిందా? ఎందుకంటే తమన్‌ ఇచ్చిన అప్‌డేట్‌ అంతలా ఆకట్టుకునేలా ఉంది కాబట్టి. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్‌ ‘ఓజీ’ సినిమా గురించి మాట్లాడారు.

‘ఓజీ’ సినిమా చాలా ఫ్రెష్ స్క్రిప్ట్. అందుకు తగ్గట్టు సంగీతం విషయంలోనూ కొత్తగా వెళ్తాం అని చెప్పిన తమన్‌.. మరికొన్ని కామెంట్స్‌ కూడా చేశారు. ‘ఓజీ’ లాంటి పాన్ ఇండియా సినిమాలో ఏమేమి చేయాలో మాకు తెలుసు. ఈ సినిమా సాధారణమైన సినిమా కాదు. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అచ్చంగా అలానే సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా ఓ టీమ్‌ పని చేస్తోంది అని చెప్పారు (Thaman) తమన్‌.

ఇక ఈ సినిమా సంగతికొస్తే.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్నాడు. ఆగస్టు 15కు సినిమా ఫస్ట్‌ లుక్‌ వస్తోంది అంటున్నారు. ఇక సెప్టెంబరు 2న టీజర్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus