‘పోలీసోడు’ గా వస్తున్న ‘తేరి’ ..

తమిళ నటుడు విజయ్ నటించిన చిత్రం తేరి. ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. అదే రోజు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల అవుతోంది. చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి తెలుగులో ‘పోలీసోడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ముందుగా ఈ చిత్రానికి విన్నర్ అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు వినవచ్చినప్పటికీ.. ఈ చిత్రానికి చివరగా పోలీసోడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాజారాణి ఫేమ్ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. విజయ్ సరసన ఎమి జాక్సన్, సమంతలు జంటగా నటిస్తున్నారు. జి‌వి ప్రకాష్ స్వర కర్త.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus