Heroines: ఆ సినిమా సమయంలో శ్రీలీలా వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్ర‌తి ఏడాది ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది కొత్త హీరోయిన్లు అడుగుపెడుతుంటారు. ఈ రంగుల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెల‌గాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. కానీ, వారిలో కొంద‌రు మాత్ర‌మే ఇక్క‌డ నిల‌దొక్కుకుని స‌త్తా చాటుతుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేస్తుంటారు. నేటిత‌రంలో మ‌న టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలోనూ అటువంటి హీరోయిన్లు ఉన్నారు. వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. కృతి శెట్టి. ఈ బ్యూటీ `ఉప్పెన‌` సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది.

తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకుని ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. అయితే ఉప్పెన మూవీ చేసే టైమ్ కు కృతి శెట్టి వ‌య‌సెంతో తెలుసా.. 17 సంవ‌త్సారాలు. శ్రీ‌లీల‌. అతి చిన్న వ‌య‌సులోనే సినిమాల్లోకి వ‌చ్చిన హీరోయిన్ల‌లో శ్రీ‌లీల ఒక‌టి. `కిస్` అనే క‌న్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి.. `పెళ్లి సందD`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

రెండేళ్లు గ‌డ‌వ‌క ముందే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిపోయింది. ప్ర‌స్తుతం తెలుగులో దాదాపు ప‌ది ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న‌ శ్రీ‌లీల‌.. 18 ఏళ్ల‌కే సినిమాల్లోకి వ‌చ్చేసింది. త‌మ‌న్నాసుదీర్ఘ కాలం నుంచి మిల్కీ బ్యూటీగా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్న త‌మ‌న్నా కూడా చిన్న వ‌య‌సులోనే ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ఈమె తొలి సినిమా `చాంద్ సా రోషన్ చెహ్రా`. ఈ మూవీ చేసే స‌మ‌యానికి త‌మ‌న్నా ఏజ్ జ‌స్ట్ 15. కాగా, ఈ వారంలో త‌మ‌న్నా (Heroines) నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి.

అందులో ఒక‌టి జైల‌ర్ కాగా.. మ‌రొక‌టి భోళా శంక‌ర్‌. ఇక 20 ఏళ్ల వ‌య‌సులో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్నా, 23 ఏళ్ల వ‌య‌సులో సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత‌, 22 ఏళ్ల వ‌య‌సులో బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే, 23 ఏళ్ల వ‌య‌సులో న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి, 21 ఏళ్ల వ‌య‌సులో మ‌హాన‌టి కీర్తి సురేష్‌, 23 ఏళ్ల వ‌య‌సులో అనుష్క శెట్టి, 19 ఏళ్ల వ‌య‌సులో చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సినీ రంగ ప్ర‌వేశం చేశారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus