Prakash Raj: ‘మా’ఎలెక్షన్స్.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలివే..!

కొన్ని నెలలుగా ‘మా’ ఎన్నికలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. వందకి పైగా ఓట్లతో ప్రకాష్ రాజ్ ని ఓడించిన మంచు విష్ణు ‘మా’ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలివే అంటూ చర్చలు మొదలయ్యాయి.

1.ప్రకాష్ రాజ్ ‘మా’ ఎలెక్షన్స్ లో పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటినుంచి లోకల్-నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు కాదనే మాటలు బలంగా వినిపించాయి. దీన్ని తిప్పికొట్టడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఇది ఆయన ఓటమికి ప్రధాన కారణమైంది.

2.ప్రచారంలో ప్రకాష్ రాజ్ కొన్ని తొందరపాటు కామెంట్స్ చేశారు. తనకు ఎవరి మద్దతు అక్కర్లేదని, పెద్దల సాయం అస్సలు వద్దని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పెద్దలనే ప్రశ్నిస్తానంటూ రివర్స్ ఎటాక్ చేయడం ప్రకాష్ రాజ్ కి నెగెటివ్ అయింది.

3.కెరీర్ పరంగా ప్రకాష్ రాజ్ చాలా బిజీ ఆర్టిస్ట్. సినిమాలతో బిజీగా ఉండే ఆయన ‘మా’ సమస్యలు పరిష్కరించడం కోసం ఎంత సమయం కేటాయించగలరనే అనుమానాలు ఏర్పడ్డాయి.

 

4.ప్రకాష్ రాజ్ తన మేనిఫేస్టో కూడా విడుదల చేయలేదు. కేవలం తనని తాను డిఫెండ్ చేసుకోడానికే ప్రయత్నించారే తప్ప.. హామీలతో ఆకట్టుకొనే ప్రయత్నం మాత్రం చేయలేకపోయారు. దీనివల్ల ‘మా’ సభ్యులు ఆలోచనలో పడ్డారు. ఇది కూడా ప్రకాష్ రాజ్ కి నెగెటివ్ పాయింట్ అయింది.

5.మెగాఫ్యామిలీను నమ్ముకొని ఉండడం కూడా ప్రకాష్ రాజ్ కి పెద్ద దెబ్బే. ఈ క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తిపై నాగబాబు చేసిన కామెంట్స్ ను చాలామంది తప్పుబట్టారు.

6.’మా’ బిల్డింగ్ అంశంపై ప్రకాష్ రాజ్ దృష్టి పెట్టలేదు. ఈ విషయంలో మంచు విష్ణు గట్టి నిర్ణయం తీసుకొని దానిపై వాగ్దానాలు చేయడం ప్రకాష్ రాజ్ ఓటమికి మరో కారణమైంది.

7.ఇప్పటివరకు ‘మా’ అధ్యక్షుడిగా పని చేసిన నరేష్ సపోర్ట్ మంచు విష్ణుకే దక్కడం. ఆయన అనుభవాలు, పరిచయాలు విష్ణుకే అనుకూలంగా మారడం ప్రకాష్ రాజ్ కి ప్రతికూలాంశంగా మారింది.

8.ప్రకాష్ రాజ్ పై చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. దర్శక, నిర్మాతలు కొందరితో గొడవలు ఉన్నాయి. ఇవన్నీ పాత గొడవలే అయినప్పటికీ ప్రతిసారి ప్రెస్ మీట్స్ లో మంచు విష్ణు వీటినే హైలెట్ చేస్తూ రావడం, వాటిని ప్రకాష్ రాజ్ తిప్పికొట్టలేకపోవడం కూడా ఆయనకు నెగెటివ్ అయింది.

9.ఎన్నికల ప్రచార సమయంలో చాలా మంది స్టార్ హీరోలపై ప్రకాష్ రాజ్ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ఇంటెన్షన్ మంచిదే అయినప్పటికీ.. కొంత నెగిటివిటిని మాత్రం కొని తెచ్చుకున్నట్లైంది.

10.ఇండస్ట్రీలో ఉన్న లేడీ ఆర్టిస్ట్ ల సమస్యల గురించి ఎక్కడా మాట్లాడలేదు. మహిళా మెంబర్స్ కి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు. మరోపక్క విష్ణు మాత్రం ఈ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నారు. అందుకే మహిళా మెంబర్స్ ఓట్లు కూడా ప్రకాష్ రాజ్ కి రాలేదనిపిస్తుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus