Bigg Boss Telugu 8: 14 మంది పార్టిసిపెంట్స్ తో ధూమ్ ధామ్ గా ప్రారంభమైన ‘బిగ్ బాస్ 8’

బిగ్ బాస్ సీజన్ 8 (తెలుగు) రియాలిటీ షో ఘనంగా ప్రారంభమైంది. ఈసారి కూడా గత సీజన్ మాదిరే 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ప్రవేశించారు. ఒక్కో కంటెస్టెంట్ లో ఉత్సాహాన్ని నింపి మరీ హౌస్ లోకి పంపాడు హోస్ట్ ‘కింగ్’ నాగార్జున.కాదు కాదు ఈసారి.. జంటగా(అంటే బడ్డీని ఎంపిక) చేసి.. వారిని హౌస్లోకి పంపాడు అని చెప్పాలి. గత సీజన్ అంటే ‘బిగ్ బాస్ 7’ ఉల్టాపల్టాగా ప్రేక్షకులను మెప్పిస్తే.. ఈ ‘బిగ్ బాస్ 8’ మాత్రం ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ ఉండదు’ అనే థీమ్ తో ప్రేక్షకులను అలరించనుంది. ఇక ‘బిగ్ బాస్’ ప్రీమియర్ షో కోసం రానా, నివేదా థామస్, నాని, ప్రియాంక అరుళ్ మోహన్, దర్శకుడు అనిల్ రావిపూడి వంటి వారు గెస్టులుగా వచ్చి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ తో హోస్ట్ నాగార్జున చెప్పిన గేమ్స్ ఆడించారు.

ఇక కంటెస్టెంట్లుగా ఎవరు హౌస్లోకి వెళ్లారు.. వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ ను లేట్ చేయకుండా ఓ లుక్కేద్దాం పదండి :

Bigg Boss Telugu 8 contestants

1) యష్మి : పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె మొదటి కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఓ పని చెప్పినప్పుడు చేయకపోయినా.. ఈమెకు ఎవరైనా అబద్ధం చెప్పినా కోపం వచ్చేస్తుందట. మరి హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి.

2) నిఖిల్ : కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన ఇతను రెండో కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు.మరి తన ఆటతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

3) అభయ్ నవీన్ : ‘పెళ్ళిచూపులు’ వంటి సినిమాల్లో నటించిన ఇతను ‘రామన్న యూత్’ వంటి సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు. మరి బిగ్ బాస్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి

4) ప్రేరణ : ‘రంగనాయకి’ అనే టీవీ షోతో పాపులర్ అయిన ఈమె 4వ కంటెస్టెంట్ గా హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. మరి తన గేమ్ తో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి

5) ఆదిత్య ఓం : ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను గుర్తుండే ఉంటాడు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇతను 5వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

6) సోనియా : రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘దిశ’ అనే సినిమాతో నటిగా మారిన ఈమె 6వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది.

7) బెజవాడ బేబక్క : సోషల్ మీడియా సింగర్, యాంకర్ అయినటువంటి బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి 7వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మరి తన కామెడీతో కంటెస్టెంట్ ని, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి

8) శేఖర్ బాషా : ‘ఆర్.జె’ కమ్ యాంకర్..గా ప్రేక్షకులకు పరిచయమైన ఇతను.. కొన్నాళ్ళు ఎటువంటి షోలలో కనిపించలేదు. అయితే ఇటీవల రాజ్ తరుణ్- లావణ్య..ల వివాదం వల్ల మళ్ళీ వార్తల్లో నిలిచాడు. మరి బిగ్ బాస్ 8 కి 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను హౌస్ లో ఎలా గేమ్ ఆడతాడో చూడాలి

9) కిరాక్ సీత : ‘బేబీ’ సినిమాతో పాపులర్ అయిన ‘కిరాక్ సీత’ 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ షోలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి

10) నాగ మణికంఠ : ఈ సీజన్ కి కామన్ మెన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇతను. మరి తన గేమ్ తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూద్దాం

11) పృథ్వీ రాజ్ : ఇప్పటివరకు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని ఇతను.. ఏదో సాధించాలని ఈ షోలో ఎంట్రీ ఇచ్చాడట. మరి గేమ్ ఎలా ఆడతాడో..!

12) విష్ణు ప్రియా : యాంకర్ గా, నటిగా చాలా పాపులర్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షోతో ఇంకా ఫేమస్. మరి కంటెస్టెంట్ గా ఎలా మెప్పిస్తుందో.

13) నైనిక : ‘ఢీ’ షో ద్వారా పాపులర్ అయిన ఈమె యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలింస్ లో నటించి ఇంకా ఫేమస్ అయ్యింది. మరి హౌస్ లో ఎలా ఉంటుందో రాబోయే ఎపిసోడ్స్ ద్వారా తెలుస్తుంది.

14) నబీల్ అఫ్రిది : వరంగల్ కి చెందిన యూట్యూబర్ ఇతను. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన చివరి కంటెస్టెంట్. మరి హౌస్ లో గేమ్ ఎలా ఆడతాడో చూడాలి.

సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus