ఒకప్పుడు హిందీ సినిమా అంటే జనాలకు మోజు. ఎలాగోలా కిందామీదా పడి అక్కడి దాకా వెళితే.. డబ్బుకు డబ్బు, ఫేమ్‌కి ఫేమ్ అని నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు భావించే రోజులు పోయాయి. ఇప్పడు దక్షిణాది సినిమాలు.. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రభ వెలిగిపోతోంది. ఇక్కడ తయారైన సినిమాలపై బాలీవుడ్ మేకర్స్ కన్నుపడుతోంది. సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. స్టోరీ ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే.. వెంటనే రీమేక్ రైట్స్ తీసేసుకుంటోంది బాలీవుడ్.
ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాలపై వాళ్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో తెలుగు సినిమాలు రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చిన బాలయ్య ‘అఖండ’ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమ కన్నుపడిందన్న వార్తలు గత కొన్నిరోజులుగా గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఒక్క అఖండనే కాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం దాదాపు 25 సౌత్ సినిమాలు హిందీలోకి రీమేక్ అవుతాయని టాక్.
అల్లు అర్జున్ అల…వైకుంఠపురములో, నాని జెర్సీ, హిట్, అల్లరి నరేశ్ నాంది, ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలు ఇప్పటికే రీమేక్ అవుతున్నాయి. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే.. కైతి, జిగర్తాండ, అన్నీయన్, విక్రమ్ వేధ, ధ్రువంగళ్ పతినరు, రాత్ససన్, తాడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ వంటి తమిళ చిత్రాలు హిందీ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. మలయాళ సినిమాల విషయానికి వస్తే.. డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నయట్టు.. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి, యు-టర్న్‌లు హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంటున్నాయి.
ఇవే కాకుండా మరికన్ని సినిమాల రీమేక్‌లకు సంబంధించి సౌత్ మేకర్స్‌తో హిందీ ప్రొడక్షన్ కంపెనీలు డిస్కషన్ చేస్తున్నారు. అన్ని ఓకే అయితే అవి కూడా పట్టాలెక్కడమే తరువాయి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!