Acharya Movie: ఆచార్య కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నెల రోజులైనా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం కావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఆర్ఆర్ఆర్ తో సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ కు ప్లస్ అయినవే ఆచార్యకు ఒక విధంగా మైనస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ 10,000కు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా అచార్య మాత్రం కేవలం 3500 థియేటర్లకు పరిమితమైంది.

Click Here To Watch NOW

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కాగా ఆచార్య మాత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కావడం లేదు. ఆర్ఆర్ఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు పెంచడం ప్లస్ కాగా ఆచార్య సినిమాకు టికెట్ రేట్ల పెంపు పరిమితంగానే ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి థియేటర్లలో ఆ సినిమాకు పెద్దగా పోటీనిచ్చే సినిమా లేదు. అయితే ఆచార్యకు మాత్రం కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి పోటీ ఎదురవుతోంది.

ఆచార్యకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే స్క్రీన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేయగా దిల్ రాజు ఆచార్యకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిన స్థాయిలో ఆచార్య ట్రైలర్ అంచనాలను పెంచలేదు. ఆచార్య కొత్త రికార్డులను క్రియేట్ చేయడం కూడా సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు సైతం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను భయపెడుతున్నాయి. అయితే ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పరిస్థితులు మారే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య మూవీ 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus