2023 లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన స్టార్స్!

2023 వ సంవత్సరం మరి కొద్ది రోజులలో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగినటువంటి సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి సెలెబ్రేటీలో గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఈ ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అటువంటి టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

మంచు మనోజ్ మౌనిక రెడ్డి: మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో రెండవ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఇలా వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్లో మంచు లక్ష్మి నివాసంలో వివాహం చేసుకున్నారు. శర్వానంద్ రక్షిత రెడ్డి: టాలీవుడ్ అండ్ హీరో శర్వానంద్ జూన్ నెలలో రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా రాజస్థాన్ లో వివాహం చేసుకున్నారు.

అనంతరం హైదరాబాదులో ఘనంగా టాలీవుడ్ సెలబ్రిటీ అందరికీ కూడా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి: మెగా హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి కూడా నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు అనంతరం హైదరాబాదులో టాలీవుడ్ సెలబ్రిటీలకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

దగ్గుబాటి అభిరామ్ ప్రత్యూష: దగ్గుబాటి వారసుడుగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అభిరామ్ ఇటీవల శ్రీలంకలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తమ సమీప బంధువుల అమ్మాయి ప్రత్యుషతో అభిరామ్ వివాహం జరిగింది. ఇలా టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా పలువురు తెలుగు బుల్లితెర సీరియల్ నటీనటులు కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus