బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరిగాయి. పిట్ లో నుంచున్న ఇంటి సభ్యులకి పై నుంచీ వచ్చే కలర్ షవర్ స్నానం మంచి కిక్ ఇచ్చింది. ఈ నామినేషన్స్ ని హౌస్ మేట్స్ తో పాటుగా , ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎవ్వరూ తగ్గట్లేదుగా అన్నట్లుగా నామినేషన్స్ లో ఒక్కొక్కరు తమ రియల్ ఫేస్ లని చూపించారు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ ఫేక్ అని, కేవలం సింపతీ కోసమే రైతుబిడ్డ అంటూ మాట్లాడుతున్నాడు అని నిరూపించే ప్రయత్నం చేశారు.
అంతేకాదు, బిగ్ బాస్ గేమ్ ని బాగా చూసి ఇక్కడ ఏం చేస్తారు ? ఏం జరుగుతుందో తెలుకుని మరీ వచ్చాడని నిలదీసి మరీ ప్రశ్నించారు. ముఖ్యంగా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడ్డాడు. పల్లవి ప్రశాంత్ కి ఫస్ట్ నుంచీ సపోర్టింగ్ గా మాట్లాడుతున్న శివాజీని సైతం తప్పుబట్టారు హౌస్ మేట్స్. నామినేషన్స్ లో శోభాశెట్టికి శివాజీకి కూడా గట్టిగా పడింది. ఇద్దరూ ఫుల్ గా ఆర్గ్యూ చేసుకున్నారు. రెండో వారం నామినేషన్స్ లో కేవలం ఒక్క ఓటు వచ్చినా కూడా బిగ్ బాస్ నామినేట్ చేసేశాడు.
ఈవారం శివాజీ, పల్లవి ప్రశాంత్ , రతిక, టేస్టీ తేజ, అమర్ దీప్, షకీల, గౌతమ్ , శోభా శెట్టి ఇంకా ప్రిన్స్ యావార్ వీళ్లందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రిన్స్ యావార్ ని డైరెక్ట్ గా పవర్ అస్త్రం పవర్ తో సందీప్ నామినేట్ చేశాడు. అలాగే షకీల, శోభాశెట్టి, గౌతమ్ లు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. దీంతో శోభాశెట్టికి ఇంకా శివాజీకి గట్టి ఆర్గ్యూమెంట్ జరిగింది.
నామినేషన్స్ లో ఆర్గ్యూమెంట్స్ ఈసారి పర్సనల్ గా కూడా టచ్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్ వీడియోల నుంచీ మొదలైన ప్రశ్నలు హౌస్ మేట్స్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసేవరకూ వెళ్లాయి. అలాగే శివాజీని సైతం ప్రియాంక, శోభాశెట్టి, థామిని ముగ్గురూ కూడా టార్గెట్ చేశారు. లైవ్ లో అయితే రితిక పల్లవి ప్రశాంత్ ని ఎందుకు టార్గెట్ చేసింది క్లియర్ గా థామినితో చెప్పింది. ట్రాక్ నడిపిస్తున్నావా అంటే బిగ్ బాస్ లో ఇలాగే ఉంటుంది
నీకు తెలీదా అని చెప్పాడని, కెమెరాల కోసమే తను చేస్తున్నానని ఓపెన్ అయ్యాడని రతిక చెప్పింది. దీంతో పల్లవి ప్రశాంత్ గుట్టు రట్టు అయ్యిందని థామినీ చెప్పింది. అందుకే, నువ్వు నామినేట్ చేశావా అంటూ అడిగింది. దీంతో రతిక పల్లవి ప్రశాంత్ ఇద్దరి మద్యలో చెడింది. ఇక మరోవైపు ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చిన శివాజీ ఓటింగ్ ఈవారం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం. ఈవారం కూడా కేవలం మూడురోజులు మాత్రమే ఓటింగ్ అనేది ఉండబోతోంది.