ఈ నలుగురు దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని దాటగలరా?

టాలీవుడ్లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అదేంటి అంటే.. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకులకు రెండో సినిమా ప్లాప్ అవుతుంది. అలా అని ఆ దర్శకుడికి ఫ్యూచర్ ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని అంత ఈజీగా అంచనా వేయలేము. రెండో సినిమా ప్లాప్ అయినా నిలదొక్కుకున్న వాళ్ళు ఉన్నారు… బాగానే రాణిస్తున్నారు. అయితే రెండో సినిమాతో హిట్టు కొట్టిన డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు.. వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు.

రాజమౌళి,త్రివిక్రమ్, కొరటాల శివ,బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి వాళ్ళు రెండో విఘ్నన్ని జయించారు. గతేడాది ‘భీష్మ’ తో వెంకీ కుడుముల కూడా రెండో విఘ్నన్ని జయించాడు. అయితే ప్రస్తుతం కొంతమంది యంగ్ డైరెక్టర్లు రెండో సినిమాతో ముడిపడి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను జయించాలి అని చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

రాధా కృష్ణ కుమార్ :

గోపీచంద్‌ తో ‘జిల్‌’ వంటి యాక్షన్‌ ఎంటర్టైనర్ ను రూపొందించిన రాధా కృష్ణ డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో తన రెండో సినిమా చేస్తున్నాడు.అదే ‘రాధేశ్యామ్‌’. ఈ చిత్రం తో కనుక అతను హిట్ కొడితే కచ్చితంగా స్టార్ డైరెక్టర్ అయిపోతాడు.

అజయ్ భూపతి :

‘ఆర్‌.ఎక్స్‌ 100’ చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్,సిద్దార్థ్ లతో ‘మహాసముద్రం’ ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇది కనుక హిట్ అయితే ఇతను స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టే..!

స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె :

నవీన్‌ పొలిశెట్టి తో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాన్ని తెరకెక్కించి థ్రిల్లింగ్ హిట్ ను అందుకున్నాడు స్వరూప్. ప్రస్తుతం ఇతను ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.స్టార్ హీరోయిన్ తాప్సీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ మూవీతో స్వరూప్‌ రెండో హిట్ అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కరుణ్ కుమార్ :

‘పలాస’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు దర్శకుడు కరుణ్ కుమార్. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో కూడా ఇతన్ని మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇతను సుధీర్‌ బాబుతో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో.. ? కరుణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.. ? తెలియాల్సి ఉంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus