టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే తమిళ సినిమాలు ఇవేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగు సినిమాలకు సమానంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తమిళ సినిమాలు ఏ రేంజ్ లో సత్తా చాటుతాయో చూడాల్సి ఉంది.

గతేడాది విక్రమ్ సినిమా తెలుగులో విడుదలై ఈ సినిమా ఇక్కడ కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. పొన్నియన్ సెల్వన్2 సినిమా సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. రజనీకాంత్ జైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాతో రజనీకాంత్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

కమల్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్2 మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సూర్య42 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విక్రమ్ రంజిత్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. తమిళ సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ సాధించాలని భావిస్తున్నా అక్కడ ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా ఈ కాంబినేషన్ ను ఎవరు సెట్ చేస్తారో చూడాల్సి ఉంది. తమిళ సినిమాలకు తమిళనాడులో మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus