Kick Movie: ‘కిక్’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!

  • May 9, 2024 / 01:43 PM IST

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja), స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి  (Surender Reddy) కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ (Kick) సినిమాని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ (R. R. Venkat) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నేనింతే’ (Neninthe) వంటి ప్లాప్ తర్వాత రవితేజ.. ‘అతిథి’ (Athidhi) వంటి ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి.. చేసిన ఈ సినిమా పై మొదట్లో బజ్ లేదు కానీ.. మౌత్ టాక్ తో ఈ మూవీ సైలెంట్ గా బాక్సాఫీస్ ని కుమ్మేసింది.

2009 మే 8న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. ఇలియానా (Ileana D’Cruz) గ్లామర్.. రవితేజ, బ్రహ్మానందం (Brahmanandam), అలీ (Ali) ..ల కామెడీ సినిమాకి బిగ్ ప్లస్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ కూడా హాలీవుడ్ లెవల్లో ఉంటాయి. అందుకే సమ్మర్ విన్నర్ గా నిలిచింది ‘కిక్’ మూవీ. అయితే ఈ మూవీ పక్కన చాలా క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీని కంటే వారం రోజుల ముందు బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘మిత్రుడు’ (Mitrudu) రిలీజ్ అయ్యింది.

మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న ఆ సినిమా ‘కిక్’ రాకతో సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మంచు మనోజ్ (Manchu Manoj) నటించిన ‘ప్రయాణం’ (Prayanam), విశాల్ (Vishal) ‘పిస్తా’, సుమంత్ (Sumanth) ‘బోణి’ (Boni), రాజశేఖర్ (Rajasekhar) ‘నా స్టైలే వేరు’ , శర్వానంద్ (Sharwanand) ‘రాజు మహారాజు’ (Raju Maharaju) , సుశాంత్ (Sushanth) ‘కరెంట్’.. వంటి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏవీ కూడా ‘కిక్’ ముందు నిలబడలేకపోయాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus