వరుస పెట్టి అందరూ.. మా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది అంటూ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పలనా సినిమా ఓటిటిలో విడుదలవుతుంది అంటూ ఎటువంటి గాసిప్స్ రాకపోయినా.. వాటి మేకర్స్ రంగంలోకి దిగి మా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తుండడం ఆలోచింప చేసే విషయం. ‘టక్ జగదీష్’ ‘ఖిలాడీ’ ‘లవ్ స్టోరీ’ ‘సీటిమార్’ వంటి సినిమాలకు పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. వాళ్ళు చాలా కాలం నుండీ థియేటర్లలో వాళ్ళ బొమ్మని దింపాలని ఎదురుచూస్తున్నారు కాబట్టి..
ప్రేక్షకులను పక్క దారి పట్టించకుండా వాళ్ళు క్లారిటీ ఇవ్వడంలో తప్పు లేదు. నితిన్ ‘మాస్ట్రో ‘ కూడా ఓటిటి అంటున్నారు కానీ దాని పై చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. చిన్న సినిమాలకు కూడా ఓటిటి నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రెండింతలు డిజిటల్ రైట్స్ రూపంలో లాభాలు వచ్చేలా ఆ ఆఫర్లు ఉంటున్నాయి. అయితే వాటి మేకర్స్ మాత్రం థియేటర్లలోనే మా సినిమా రిలీజ్ అంటూ తెగేసి చెప్పేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగష్ట్ లేదా సెప్టెంబర్ వరకూ థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఒకవేళ తెరుచుకున్నా.. వాటికి పెద్ద సినిమాలతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. దాంతో కమర్షియల్ గా దెబ్బ పడే ప్రమాదం కూడా లేకపోలేదు. పోనీ లేటైనా పర్వాలేదు అని ఎదురుచూస్తాం అనుకుంటే.. అప్పటివరకు ఇంట్రెస్ట్ లు కట్టుకుంటూ నిర్మాతలు తట్టుకుంటారా అనేది మరో ప్రశ్న. మరి వాళ్ళ మనసులో ఏముందో..!
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!