ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా జగపతి బాబు ఉండేవాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా వచ్చి చేరేవాడు. ప్రేమ కథా చిత్రాలకి, విలక్షణ పాత్రలకి, సహాయనటుడు పాత్రలకి అతను కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచేవాడు. అందుకే శ్రీకాంత్ హీరోగా యమ బిజీగా ఉండేవాడు. కచ్చితంగా 3 సినిమాల్లో ఒక హిట్ కొట్టేవాడు. మిగిలినవి కూడా బిజినెస్ పరంగా సేఫ్ అయ్యేవి. అందుకే శ్రీకాంత్ చాలా కాలంగా హీరోగా సినిమాలు చేశాడు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది.
శ్రీకాంత్ (Srikanth) హీరోగా చేసిన 10 సినిమాల్లో ఒకటి హిట్ గా నిలిచేది. ఇంకో రెండు సేఫ్ అనిపించినా, మిగిలిన సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యేవి. దీంతో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాలకి డిమాండ్ తగ్గుతూ వచ్చేది. దీంతో రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయితే అతని సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ వెంటనే దక్కలేదు అనే చెప్పాలి. అయితే ‘అఖండ’ నుండి ఇతని కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. అందులో ఇతను పార్ట్ టైం విలన్ గానే చేశాడు.
కానీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల.. ‘వారసుడు’ ‘గేమ్ ఛేంజర్’ ‘దేవర’ వంటి పెద్ద సినిమాల్లో ఛాన్స్ కొట్టాడు. ఇప్పుడైతే అతను ప్రధాన పాత్ర పోషించిన ‘కోటబొమ్మాళి పీఎస్’ కూడా సక్సెస్ అయ్యింది. ఓ రకంగా దీనిని బట్టి చూస్తుంటే.. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో అదీ పోలీస్ గా చేస్తే పక్కాగా హిట్ వెతుక్కుంటూ వస్తుందట. ఒక ‘మెంటల్ పోలీస్'(మెంటల్) సినిమాని తీసేస్తే.. మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే అందించాయి. ‘కోటబొమ్మాళి పీఎస్’ మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసింది అని చెప్పాలి