Star Heroes: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహానికి ప్రాణమిచ్చే గొప్ప స్నేహితులు వీళ్లే!

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మంచి వాళ్లతో స్నేహం చేస్తే జీవితం అందంగా, అద్భుతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ నెల 6వ తేదీన ఫ్రెండ్ షిప్ డే కాగా రక్త సంబంధం కాకపోయినా స్నేహ బంధం ద్వారా దగ్గరైన హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో చిరంజీవి నాగార్జున ముందువరసలో ఉంటారు. చిరంజీవి నాగార్జున బహిరంగంగా తమ స్నేహాన్ని వ్యక్తపరచకపోయినా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. మెగా నందమూరి కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరు హీరోల మధ్య స్నేహం గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. ఈ మధ్య కాలంలో చరణ్, తారక్ కలిసి కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఒకరిపై మరొకరు అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. చరణ్ తారక్ మధ్య స్నేహం కలకాలం ఇదే విధంగా కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రామ్ చరణ్ రానా (Star Heroes) మధ్య మంచి అనుబంధం ఉండగా చిన్నప్పటి నుంచి మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రభాస్ గోపీచంద్ మధ్య మంచి స్నేహం ఉంది. వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ కలిసి నటించడం గమనార్హం. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గోపీచంద్ కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే.

నితిన్ అఖిల్, నాని అల్లరి నరేష్, రామ్ చరణ్ శర్వానంద్, ఎన్టీఆర్ మనోజ్, రజనీకాంత్ మోహన్ బాబు, మహేష్ వంశీ పైడిపల్లి, బాలయ్య శివరాజ్ కుమార్, త్రివిక్రమ్ సునీల్ మధ్య స్నేహ బంధం ఉండగా ఈ బంధం కలకాలం కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్నేహ బంధంతో పలువురు సెలబ్రిటీలు ఒకరి సినిమాలను మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకరి సినిమాలు సక్సెస్ అయితే మరొకరు సంతోషిస్తూ ఆ సినిమాల రేంజ్ పెరగడానికి మరింత కష్టపడుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus