Unstoppable3: అన్ స్టాపబుల్3 షోకు ఈ హీరోలు రావడం సులువు కాదా?

ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్1, అన్ స్టాపబుల్ సీజన్2 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయి. ఆహా ఓటీటీ స్థాయిని పెంచడంలో ఈ షోలు ఉపయోగపపడ్డాయి. అయితే సీజన్1, సీజన్2 కు హాజరు కాని సెలబ్రిటీల జాబితా కూడా పెద్దదే అనే సంగతి తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, యంగ్ జనరేషన్ హీరోలు ఈ షోకు హాజరు కావాల్సిన జాబితాలో ఉన్నారు.

సమంత కూడా ఈ షోకు హాజరైతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఒక రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున మరో షోలో పాల్గొనడం కష్టమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ పలు పొలిటికల్ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తారక్ ఈ షోకు హాజరు కావడానికి ఎంతవరకు ఆసక్తి చూపుతాడనే ప్రశ్న సైతం వినిపిస్తుండటం సోషల్ మీడియా వేదికగా తెగ హాట్ టాపిక్ అవుతోంది. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి హాజరైతే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. దసరా కానుకగా (Unstoppable3) అన్ స్టాపబుల్3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.

దసరా కానుకగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి కూడా రిలీజ్ కానుంది. ఈ నెల 8వ తేదీన భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ తో ఈ సినిమా కథకు సంబంధించి క్లారిటీ రానుంది. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్ లను సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus