పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీనే థియేటర్లలో రిలీజవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీలోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాను చూశారని పవన్ కు సినిమా ఎంతగానో నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలను ఎప్పుడు సడలిస్తే అప్పుడే భీమ్లా నాయక్ సినిమా రిలీజవుతుందని ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భీమ్లా నాయక్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ మేకర్స్ ప్రధానంగా మూడు మార్పులు చేశారని సమాచారం అందుతోంది. భీమ్లా నాయక్ సినిమా నిడివి అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా నిడివి కంటే అరగంట తక్కువగా ఉండనుంది.
క్రిస్పీ రన్ టైమ్ తో భీమ్లా నాయక్ తెరకెక్కగా మలయాళంలో లేని రొమాంటిక్ ట్రాక్ తెలుగులో పవన్, నిత్యామీనన్ మధ్య ఉండనుందని సమాచారం అందుతోంది. అయ్యప్పనుమ్ కోషియమ్ లో లేని ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకు భీమ్లా నాయక్ స్క్రిప్ట్ లో ఈ మార్పులు జరిగాయని బోగట్టా. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలను తెరకెక్కించిన సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. భీమ్లా నాయక్ ఎప్పుడు విడుదలైనా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.