సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వర్ష ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి స్టార్ హీరోలకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలకు గత కొంతకాలంగా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడు షారుక్ ఖాన్ గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇలా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రజనీకాంత్ జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలమైనటువంటి విజయాన్ని అందుకుంది అంతేకాకుండా రజనీకాంత్ కు గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాతో బిజీగా ఉన్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) వరుస మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూడు సినిమాలు కూడా తీవ్రస్థాయిలో నిరాశ పరిచాయి. ఇక ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చినటువంటి సలార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇది కదా ప్రభాస్ కి సరైన సక్సెస్ అంటే అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు అయితే ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నారు. ఇలా ఈ ఏడాది ఈ ముగ్గురు స్టార్ హీరోలకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.