Tollywood Stars: ఈ టాలీవుడ్ సెలబ్రిటీలు ఇన్ స్టా లో ఒక్కరినీ కూడా ఫాలో కావడం లేదా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ హీరోకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఆ హీరో పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెజారిటీ స్టార్ హీరోలకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. అయితే మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా కొంతమంది హీరోలు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కరినీ కూడా ఫాలో కావడం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు (Jr NTR) ఇన్ స్టాగ్రామ్ లో 7.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అయితే తారక్ మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో ఏ ఒక్కరినీ ఫాలో కావడం లేదని తెలుస్తోంది. ట్విట్టర్ లో ఎస్.ఎస్. రాజమౌళిని (S. S. Rajamouli) ఫాలో అవుతున్న తారక్ ఇన్ స్టాగ్రామ్ లో ఏ ఒక్క సెలబ్రిటీని ఫాలో కాకుండా వార్తల్లో నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) సైతం ఇన్ స్టాగ్రామ్ లో ఎవరినీ ఫాలో కాకుండా వార్తల్లో నిలుస్తున్నారు. చిరంజీవికి ఇన్ స్టాగ్రామ్ లో 3.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తన ఫ్యామిలీలోనే చాలామంది హీరోలు ఉన్నా చిరంజీవి వాళ్లను ఫాలో కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

యంగ్ హీరో రామ్ పోతినేనికి (Ram Pothineni) ఇన్ స్టాగ్రామ్ లో 3.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ హీరో కూడా ఎవరినీ ఫాలో కావడం లేదని సమాచారం అందుతోంది.. మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 21.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. విజయ్ కు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నా ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కాకపోవడం గమనార్హం.. పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) ఇన్ స్టాగ్రామ్ లో 3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఎవరినీ ఫాలో కావడం లేదు. అల్లు అర్జున్ (Allu Ajun) ఇన్ స్టాగ్రామ్ లో ఒకే ఒక్కరిని ఫాలో అవుతుండగా కేవలం భార్యను మాత్రమే ఫాలో అవుతూ ఈ హీరో వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కుతున్న నేపథ్యంలో ఈ హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగాలని ఈ హీరోల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus