Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఆ ఇద్దరూ కెరీర్ పరంగా ప్లస్ అవుతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదాయ సిత్తం రీమేక్ షూటింగ్ తాజాగా మొదలు కాగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వినోదాయ సిత్తం రీమేక్ లో పవన్ కు జోడీ ఉండదని తెలుస్తోంది. పవన్, సాయితేజ్ లతో కలిసి శ్రీలీల ఒక సాంగ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుంది.

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ ను ప్రశంసిస్తున్నారు. వీళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ బలం అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా సరైన కథలను ఎంచుకునే విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వరుస విజయాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మరోవైపు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి నాదెండ్ల మనోహర్ కష్టపడుతున్నారు. త్రివిక్రమ్, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ బలం అని కొంతమంది కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కు వాళ్లిద్దరి సపోర్ట్ ఉందని వాళ్లిద్దరూ కెరీర్ పరంగా చాలా మేలు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ మంచితనం, గొప్పదనం వల్లే ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పవన్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండటం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus