పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. అదే ఓజి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే యావత్ సినీ ప్రేక్షకులు, బయ్యర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ‘ఓజి’ ప్రస్తావన ఎక్కువగా తెస్తే అందరిలో ఒక హుషారు నెలకొన్న సందర్భాలు ఎన్నో చూశాం. ఇదిలా ఉండగా .. ఇప్పటివరకు ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అంతా అనుకున్నారు. కానీ దానికి కొత్త డెఫినిషన్ చెబుతూ ‘ఫైర్ స్టార్మ్ ‘ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘ఓజి’ ఓజాస్ గంభీర అట. ‘ఫైర్ స్టార్మ్’ సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.మాస్ ను టార్గెట్ చేస్తూ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు.హీరో శింబు ఈ పాటని హుషారుగా ఆలపించగా… విశ్వ, శ్రీనివాస్ మౌళి లిరిక్స్ కూడా వెంటనే ఎక్కేసేలా ఉన్నాయి. హరి హర వీరమల్లుతో కొంచెం డల్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తిరిగి ఈ పాట నూతన ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంది అనే చెప్పాలి.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.