ఎన్టీయార్ గారి సినిమాలన్నీ చూపించేవారు

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రేపు విడుదల కానున్న చిత్రం ‘జై సింహా’. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు విడుదలవుతున్న “జై సింహా” గురించి నటాషా మాట్లాడుతూ.. “నేను పుట్టింది పెరిగింది ముంబైలో. మా అమ్మ మలయాళీ, నాన్న గుజరాతీ. నేను వైద్య విద్య అభ్యసించాను. ప్రస్తుతం నివసిస్తోంది ముంబైలోనే. నేను డెంటిస్ట్ ని. అందుకే, నేను డాక్టర్ నటాషా దోషి. “జై సింహా”లో బాలయ్యసార్ తో ఈ సినిమాలో నాకు నటించే అవకాశం దానంతట అదే వచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర కోసం సుమారు వంద మంది అమ్మాయిలను చూశారు. కానీ, ఎవరూ నచ్చలేదు. చిత్ర నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు కేఎస్ రవికుమార్ వద్దకు నా ఫొటోలు చేరాయి. దీంతో, నాకు వాళ్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఈ చిత్ర కథను, అందులో నా పాత్ర గురించి నాకు చెప్పారు. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. వెంటనే, నటిస్తానని చెప్పాను.

2017లో నాకు దక్కిన అదృష్టం ఇది. అంకిత భావంతో పని చేసే చిత్రయూనిట్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా, బాలయ్య సార్ గురించి చెప్పాలంటే.. బుక్ ఆఫ్ నాలెడ్జ్. చాలా తెలివిగల వ్యక్తి. తన తండ్రిని ఎంతో గౌరవించే వ్యక్తి ఆయన. సెట్స్ లో ఖాళీ సమయంలో ఎన్టీరామారావు గారి సినిమాలను బాలయ్య సార్ తన ఐ-ప్యాడ్ లో నాకు చూపించేవారు. నిజం చెప్పాలంటే .. బాలయ్య సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన సూపర్ స్టార్. “జై సింహా” సినిమా చూసిన తర్వాత బాలయ్య సార్ పై ప్రేక్షకులకు, అభిమానులకు ఉన్న అభిమానం మరింత పెరుగుతుంది” అని చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus