Bigg Boss Telugu 6: అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఏం చెబుతున్నాయి ? ఎలిమినేషన్ లో ట్విస్ట్..!

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఎలిమినేషన్స్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే, ఈసారి హౌస్ మొత్తం నామినేషన్స్ లో ఉంది. గతవారం కెప్టెన్ లేకపోవడం వల్ల ఈవారం హౌస్ లో ఉన్న 14మంది నామినేషన్స్ లో ఉన్నారు. కాబట్టి, ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్న ఇద్దరు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. నిజానికి చేపల చెరువు టాస్క్ వల్ల ఓటింగ్ లో చాలా తేడాలు వచ్చాయి.

అన్ అఫీషియల్ పోలింగ్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు. సేఫ్ గా ఉన్నాడు. గత రెండు వారాలుగా రేవంత్ సేఫ్ గానే ఉంటున్నాడు. అలాగే, రేవంత్ తో పాటుగా శ్రీహాన్ కూడా మంచి ఓటింగ్ పర్సెంటేజ్ తో సేఫ్ గానే ఉన్నాడు. ఇక ఇక్కడ్నుంచే అందరూ డేంజర్ జోన్ అని చెప్పాలి. అంటే, దాదాపుగా 12మంది ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నారు. అందరికీ ఆల్ మోస్ట్ కొద్దిగా అటు , ఇటుగా ఓటింగ్ అనేది జరుగుతోంది.

బిగ్ బాస్ రివ్యూవర్స్ గా హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చిన గీతు , ఆదిరెడ్డి అన్ అఫీషియల్ ఓటింగ్ లో వెనకబడిపోయారు. దీనికి కారణం గీతు గతవారం నామినేషన్స్ లో లేకపోవడమే అని చెప్పాలి. ఆదిరెడ్డి ఉన్నా కూడా గతవారం కంటే కూడా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తో ఉన్నాడు. అలాగే, బాలాదిత్య, ఇనయ ఇద్దరూ కూడా తమ ఓటింగ్ ని పెంచుకుంటున్నారు. మరోవైపు కపుల్ ఎంట్రీ ఇచ్చిన మెరీనా , రోహిత్ కూడా ఈవారం గేమ్ బాగా ఆడి తమ ఓట్ బ్యాంక్ ని పెంచుకుంటున్నారు.

ఇక మిగిలిన ఆరుగురులోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. వీరిలో, శ్రీసత్య, సూర్య, ఫైమా, రాజ్, వాసంతీ ఇంకా కీర్తి ఉన్నారు. వీళ్లలో డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరైనా వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఈవారం కీర్తి ఇంకా ఫైమా గతవారం కంటే కూడా తక్కువ పర్సెంటేజ్ తో ఉన్నా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వాసంతీకి కూడా సింపతీ వర్కౌట్ అవుతోంది.

ఇక రాజ్, సూర్య, శ్రీసత్య వీళ్లలో ఎలిమినేషన్ జరిగితే సూర్య , రాజ్ ఇద్దరూ డేంజర్ అనే చెప్పాలి. వీళ్లలో ఒకరు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. అన్ని అన్ అఫీషియల్ వెబ్ సైట్స్ లో చూస్తే గనక, సూర్య వెనకబడి ఉన్నాడు. ఈవారం సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా సూర్యకి ఎలిమినేషన్ గండం కనిపిస్తోంది. మరి ఈవారం గేమ్ లో పెర్పామన్స్ బాగుంటే లాస్ట్ రెండు రోజులు ఓటింగ్ పెరిగితే సేఫ్ అవుతాడు. లేదంటే మాత్రం ఈవారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus