ఈ కుర్రాడు తెలుగులో క్లిక్ అవ్వడం కష్టమేనేమో
- February 15, 2019 / 07:01 PM ISTByFilmy Focus
సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజీషియన్స్ లో అనిరుధ్ ఒకడు. తనకంటే సీనియర్స్ అయిన యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ లను కూడా బీట్ చేసి మరీ తమిళనాట నెంబర్ 1 గా నిలిచాడు అనిరుధ్. మనోడి పాటలకంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ.. మనోడు తెలుగులో మాత్రం ఎందుకో క్లిక్ అవ్వలేకపోయాడు. “అజ్ణాతవాసి” లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్ లో కూడా అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ పనిచేయలేదు. పాటలైతే హిట్ అయ్యాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. దాంతో అనిరుధ్ కి సెకండ్ ఛాన్స్ ఇద్దామనుకున్న త్రివిక్రమ్ కూడా సైలెంట్ అయిపోయాడు.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ
మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత “జెర్సీ”తో తెలుగులో మళ్ళీ తన లక్ ను చెక్ చేసుకోనూన్నాడు అనిరుధ్. నిన్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. రోమాంటిక్ మెలోడీ అయిన “ఏమిటో గాని” డిఫరెంట్ గా ఉంది కానీ.. ఆ పాటను అనిరుధ్ పాడడం పుణ్యమా అని తెలుగు ఫ్లేవర్ మిస్ అయ్యింది. అనిరుధ్ సంగీతం అందించడం వరకు ఒకే కానీ.. ఇలా అన్నీ పాటలు తానే పాడేయకుండా వేరే సింగర్స్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చాలా మంది భావించారు. ఈ విషయాన్ని అనిరుధ్ ఎప్పటికీ అర్ధం చేసుకుంటాడో చూడాలీ.
















