సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబుకు పరశురామ్ మరో హిట్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా సెకండ్ వీకెండ్ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దర్శకుడిగా పరశురామ్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. సెకండాఫ్ విషయంలో పరశురామ్ మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మారేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట సక్సెస్ వల్ల పరశురామ్ కు మరో స్టార్ హీరో ఛాన్స్ ఇస్తారా? అనే ప్రశ్నకు నో అనే సమాధానం వినిపిస్తోంది.
సర్కారు వారి పాట సినిమాకు మహేష్ క్రేజ్ ప్లస్ అయిందని మరో హీరోతో ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే మాత్రం ఈ స్థాయి ఫలితం దక్కేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్లాసీ, సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అద్భుతంగా తెరకెక్కిస్తున్న పరశురామ్ మాస్ సినిమాలను తెరకెక్కించడంలో కొంతమేర ఫెయిల్ అవుతున్నారు. మాస్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా తెరకెక్కించే విషయంలో ఈ దర్శకునికి మంచి మార్కులు పడలేదనే సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అద్భుతమైన లైన్ తో తెరకెక్కిందని
అయితే సన్నివేశాల్లో ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండకపోవడంతో సినిమాపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. సామాన్యుడికి బ్యాంక్ లో రుణం తీసుకోవడానికి ఎదురయ్యే ఇబ్బందులు, డాక్యుమెంట్ల కోసం ఇబ్బంది పెట్టడం గురించి కూడా పరశురామ్ చర్చించి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు. నాగచైతన్య సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మాత్రమే పరశురామ్ కు సినిమా ఆఫర్లు పెరగడంతో పాటు స్టార్ హీరోల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
పరశురామ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకోనుందో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే చైతన్య సినిమాకు మాత్రం పరశురామ్ కు ఈ రేంజ్ రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ అయితే లేదు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!