Unstoppable2: అన్ స్టాపబుల్ సీజన్2 కు అసలు సమస్య ఇదేనా?

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ షో సీజన్2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరు కానున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. చంద్రబాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో అతి త్వరలో రిలీజ్ కానుంది. పవన్ కూడా ఈ షోకు హాజరైతే ఆ ఎపిసోడ్ అన్ స్టాపబుల్2 చివరి ఎపిసోడ్ గా ప్రసారం కానుంది.

అయితే ఈ షో సీజన్2 కు సరైన గెస్ట్ లు దొరకడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్, కళ్యాణ్ రామ్ లను ఈ షోకు అతిథులుగా ఆహ్వానించటానికి బాలయ్య సుముఖంగా లేరని బోగట్టా. తాజాగా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ లుగా హాజరైన ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ పూర్తైంది. పెద్ద హీరోలు ఈ షోకు డేట్లు కేటాయించకపోవడంతో చిన్న హీరోలు ఈ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారని తెలుస్తోంది.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఈ షోలో పాల్గొనే ఛాన్స్ ఉందని బాలయ్య చెప్పినా ఆయా సెలబ్రిటీలు ఈ షోకు డేట్లు కేటాయించడం సులువు కాదు. ఈ షోకు సీనియర్ హీరోలు నో చెబుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వివాదాస్పద ప్రశ్నల గురించి స్పందించడం వల్ల చాలా సందర్భాల్లో మంచి కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ సీజన్2 కు సరైన గెస్ట్ లు దొరకని పక్షంలో ఏం జరుగుతుందో చూడాలి.

మహేష్, బన్నీ ఇప్పటికే ఈ షోకు హాజరయ్యారు. తారక్ ఈ షోకు హాజరయ్యే ఛాన్స్ లేదు. ప్రభాస్ సాధారణంగా ఇలాంటి షోలకు దూరంగా ఉంటారు. చరణ్ సోలోగా ఈ షోకు రావడం కంటే చిరంజీవి, చరణ్ కలిసి ఈ షోకు హాజరైతే బాగుంటుంది. అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus