Balayya Babu,Ram Charan: బాలయ్య, చరణ్ ఆ విషయంలో నిజంగా గ్రేట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య, చరణ్ లకు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ బాబీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా సెకండాఫ్ లో 40 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఒక విషయంలో మాత్రం బాలయ్య, చరణ్ సేమ్ టు సేమ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుల పనిలో ఈ ఇద్దరు హీరోలు జోక్యం చేసుకోరని దర్శకులు కోరుకున్న విధంగా నటించడం కోసం ఎంతైనా కష్టపడే విషయంలో ఈ హీరోలు ముందువరసలో ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య, చరణ్ ఆ విషయంలో నిజంగా గ్రేట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య, చరణ్ దర్శకులను ఎంత నమ్ముతారో చెప్పడానికి ఇదే సాక్ష్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి హాజరైతే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో ఈ కోరిక తీరుతుందేమో చూడాలి. నాగార్జున కూడా ఈ షోకు గెస్ట్ గా హాజరైతే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అన్ స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బాలయ్య (Balayya Babu) తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీలో దుల్కర్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాబీ సినిమా తర్వాత బాలయ్య నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. చరణ్, బాలయ్యలకు 2024 సంవత్సరం కూడా కలిసిరావాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus