Krithi Shetty: ఈ సినిమా తేడా కొడితే.. కృతి ఇక అయిపోయినట్లేనా?
- September 10, 2024 / 12:04 PM ISTByFilmy Focus
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉంటారు. లేదంటే ఎంత వేగంగా వచ్చారో అలానే బయటకు వెళ్లిపోతారు. ఈ విషయం చాలామంది హీరోయిన్ల విషయంలో కరెక్ట్ అయింది కూడా. అయితే సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటే ఫర్వాలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది కృతి శెట్టి (Krithi Shetty) . తెలుగులో సరైన సినిమాలు ఎంపిక చేసుకోకుండా ఇబ్బందిపడ్డ ఆమె.. మలయాళ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకోబోతోంది. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో అరంగేట్రంలోనే అదిరిపోయే విజయం అందుకుని కాబోయే స్టార్ హీరోయిన్ అని అందరూ అనేలా చేసింది కృతిశెట్టి.
Krithi Shetty

బేబమ్మ.. బేబమ్మా అంటూ కుర్రకారు ఆమె పేరే జపించారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆ స్థాయి విజయం అందుకోలేదు. ఒకవేళ సినిమా ఓకే అనిపించినా.. ఆమె పాత్రకు సరైన వాల్యూ లేక అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది అనిపించింది. ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) , ‘బంగార్రాజు’ (Bangarraju) రెండో రకం సినిమాలే. అయితే ఆ తర్వాత ‘వారియర్’ (The Warriorr) , ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam), ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ (Custody) , ‘మనమే’ (Manamey) చేసినా ఏదీ విజయం అందివ్వలేదు.
సినిమా కథల ఎంపికలో ఆమె చేసిన తప్పిదాలే కారణం అని చెబుతున్నారు. ఈ క్రమంలో మలయాళంఓల టొవినో థామస్ (Tovino Thomas) ‘ఏఆర్ఎం’లో ఛాన్స్ సంపాదించింది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో కృతికి (Krithi Shetty) ఈ హిట్ చాలా అవసరం అనే పరిస్థితి వచ్చింది. తన కెరీర్ తిరిగి పుంజుకోవాలంటే ఈ హిట్ తప్పనిసరి. మరి ఆమె రాణిస్తుందా? సినిమా విజయం అందుకుంటుందా అనేది చూడాలి.

అన్నట్లు ఈ సినిమా తేడా కొట్టినా తమిళంలో మూడు సినిమాలు ఆమెకు ఉన్నాయి. కార్తి (Karthi) ‘వా వాతియార్’, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, జయం రవి (Jayam Ravi) ‘జీనీ’ ఉన్నాయి. ‘ఏఎంఆర్’ విజయం అందుకుంటే కృతి (Krithi Shetty) కెరీర్‌కు నెక్స్ట్ మూడు సినిమాలు భారీ అంచనాలు ఇచ్చేవి అవుతాయి. లేదంటే అవి కూడా విజయం అవసరం ఉన్న సినిమాలు అయ్యి భారం అవుతాయి.















