NTR: అలా జరిగితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు తిరగరాస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాను 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే సమ్మర్ లో టాలీవుడ్ హీరోల భారీ ప్రాజెక్ట్ లేవీ రిలీజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ విధంగా జరిగితే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలా జరిగితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) రికార్డులు తిరగరాస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని ఎన్టీఆర్ అభిమానులకు కచ్చితంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ కాంబో సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ వరుస విజయాలతో రాబోయే రోజుల్లో కూడా జోరును కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వరుస విజయాలతో తారక్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ ల షూటింగ్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో పాటు వార్2 కూడా వచ్చే ఏడాది మొదలుకానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. తారక్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus