Janata Garage, Kushi: తారక్ జనతా గ్యారేజ్, విజయ్ ఖుషి సినిమాల మధ్య ఉన్న ఈ లింక్ తెలుసా?

  • September 3, 2023 / 01:46 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో జనతా గ్యారేజ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కు జోడీగా సమంత నటించగా కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లోనే ఈ సినిమా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో తారక్ యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉంటుంది.

2016 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అయితే తాజాగా విడుదలైన విజయ్ దేవరకొండ ఖుషి కూడా సెప్టెంబర్ నెల 1వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో కూడా సమంత హీరోయిన్ కాగా ఈ మూవీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఖుషి (Kushi) మూవీ కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉన్నాయి. ఖుషి మూవీ సండే బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి. ఖుషి సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమా భారీ లాభాలను అందించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఖుషి మ్యాజిక్ ను విజయ్ దేవరకొండ ఖుషి మూవీ రిపీట్ చేయడం గమనార్హం. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతో ఇతర భాషల్లో సైతం మార్కెట్ పెరగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత రేంజ్ ఈ సినిమాతో మరింత పెరిగింది. ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus