NBK107: బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ టైటిల్ ప్రకటనకు సమస్య ఇదేనా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ కాగా త్వరలో ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయినా

ఈ సినిమాకు టైటిల్ ప్రకటించకపోవడం ఏమిటని బాలయ్య అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఒక పాట వల్ల ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని క్లారిటీ వచ్చింది. అయితే మేకర్స్ మాత్రం పోస్టర్ ద్వారా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే “జై బాలయ్య” అనేది బాలయ్య స్లోగన్ అనే సంగతి తెలిసిందే.

యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడంతో జై బాలయ్య అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయడం కరెక్టేనా అని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు జై బాలయ్య టైటిల్ ఫిక్స్ అవుతుందా? లేక మేకర్స్ ఈ సినిమా కోసం మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. బాలయ్య, శృతి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేననే సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాలయ్య కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus