Shaakuntalam: ఈ హీరో హీరోయిన్ నటించి ఉంటే శాకుంతలం రిజల్ట్ మారేదా?

గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్హ పాత్ర మినహా మిగతా పాత్రలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. సమంత, దేవ్ మోహన్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీలలను ఆ పాత్రలకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత శకుంతల రోల్ కు అయితే న్యాయం చేయలేదని కామెంట్లు చేస్తున్నాయి. మరోవైపు గుణశేఖర్ ఈ తరం ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతాయో దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.

శాకుంతలం (Shaakuntalam) సినిమా కలెక్షన్ల పరంగా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉంది. దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గుణశేఖర్ కు కొత్త సినిమా అవకాశాలు రావడం సులువు కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫలితం గుణశేఖర్ కు భారీ షాక్ అనే చెప్పాలి. శాకుంతలం సినిమాకు గుణశేఖర్ నిర్మాత కూడా కావడంతో ఆర్థికంగా భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది.

ఈ సినిమా నష్టాల నుంచి గుణశేఖర్ కోలుకోవడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గుణశేఖర్ డైరెక్షన్ కే పరిమితం కావాలని నిర్మాణ భారాన్ని మోయకూడదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సమంత కెరీర్ పై ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. సమంత సైతం తనకు నప్పని పాత్రలకు దూరంగా ఉంటే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.

దేవ్ మోహన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇవ్వగా ఈ హీరో ఆశలు అడియాశలయ్యాయి. తమిళంలో రెయిన్ బో సినిమాలో నటిస్తున్న దేవ్ మోహన్ ఆ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus