Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి మూవీ ఇప్పట్లో లేనట్టేనా.. ఏమైందంటే?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. బోయపాటి శ్రీను చూపించిన విధంగా బాలయ్యను ఎవరూ చూపించలేరని ఇండస్ట్రీలో ఉంది. ఈ కాంబినేషన్ లో అఖండ2 సినిమా తెరకెక్కనుందని చాలా రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ పూర్తైన వెంటనే అఖండ2 సినిమా మొదలవుతుందని చాలామంది భావించారు.

అయితే బోయపాటి శ్రీను బన్నీ సినిమాతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బోయపాటి మూవీ ఇప్పట్లో లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ కాంబోలో సినిమా రావాలంటే మరో రెండేళ్ల పాటు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. స్కంద మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో (Boyapati Srinu) బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్న నేపథ్యంలో కెరీర్ పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదనే సంగతి తెలిసిందే. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీ కమర్షియల్ గా హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంది. బన్నీ బోయపాటి శ్రీను కాంబోలో సినిమా రావాలని అటు బన్నీ ఇటు బోయపాటి శ్రీను అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus