గత కొన్నేళ్లుగా రజనీకాంత్ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. కథల విషయంలో రజనీకాంత్ తప్పటడుగులు వేస్తున్నారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే రజనీ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా జైలర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని కావాలయ్యా సాంగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అయితే జైలర్ సినిమాను చూడాలని భావించే అభిమానుల కోసం చెన్నై, బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి.
కొన్ని కంపెనీలు అయితే ఏకంగా ఉద్యోగులకు టికెట్లు కూడా ఇవ్వడం గమనార్హం. (Rajinikanth) రజనీకాంత్ కబాలి మ్యాజిక్ ను జైలర్ సినిమాతో మరోసారి రిపీట్ చేస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.కబాలి విడుదలకు ముందు కూడా పలు కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. యూనో అక్వా కేర్ అనే కంపెనీ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్లు ఇవ్వడం గమనార్హం. మరోవైపు జైలర్ మూవీతో బుకింగ్స్ విషయంలో రజనీకాంత్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. జైలర్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో రజనీకాంత్ భీభత్సం సృష్టిస్తుండటం గమనార్హం. బెంగళూరులో ఇప్పటివరకు జైలర్ సినిమాకు సంబంధించి 75,000 టికెట్లు అమ్ముడయ్యాయని 3 కోట్ల రూపాయలకు పైగా మొత్తం 903 షోలకు వచ్చిందని తెలుస్తోంది. కొన్ని మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు 1000 కంటే ఎక్కువగా ఉన్నా అభిమానులు మాత్రం తగ్గడం లేదు.
జైలర్ సినిమాకు టాక్ అనుకూలంగా ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. జైలర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. జైలర్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!