Devara: ఆస్ట్రేలియాలో సైతం దేవర మాస్ ర్యాంపేజ్.. అసలేమైందంటే?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర (Devara) సినిమా ఓవర్సీస్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుండటం గమనార్హం. నార్త్ అమెరికాలో దేవర మూవీ ప్రీ సేల్స్ పరంగా అదరగొడుతోంది. ఆస్ట్రేలియాలో తాజాగా దేవర బుకింగ్స్ మొదలు కాగా అక్కడ కూడా ఈ సినిమాకు లక్ష డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. దేవరపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇదే సాక్ష్యమని చెప్పవచ్చు.

Devara

ఆరేళ్ల తర్వాత తారక్ నటించి విడుదలవుతున్న సోలో సినిమా కాబట్టే దేవర సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 3 గంటల నిడివితో ఈ సినిమా రిలీజవుతున్నా కథ, కథనం అద్భుతంగా ఉంటే ఈ నిడివి సమస్య కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సైతం దేవర మాస్ ర్యాంపేజ్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఓవర్సీస్ లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల వెర్షన్లతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా బిజినెస్ విషయంలో మాత్రం నిర్మాతలు ఒకింత సంతృప్తితోనే ఉన్నారని సమాచారం అందుతోంది. దేవర తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు క్రియేట్ అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. దేవర సినిమాలో తారక్ లుక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. రెండు రోల్స్ లో తారక్ అదరగొట్టడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విదేశాల్లో తారక్ దేవర కలెక్షన్లతో సంచలనాలు సృష్టిస్తారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఆ సమయంలో ఎంతో ఏడ్చానని చెప్పిన రకుల్.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus